
అది పాము..మామూలు పాము కాదు..సముద్ర పాము..ఈ పాము ముఖం కుక్క ముఖం ఉన్నట్లు ఉంటుంది. వెడల్పుగా, రెండు కళ్లు పెద్దవిగా ఉంది. ఇలాంటి పాములు సముద్రంలో ఉంటాయి.. సముద్రంలోని పాములకు ఉండే లక్షణాలకు భిన్నంగా ఉంది దాని ఆకారం..ఇప్పుడు ఆ సముద్ర పాము..అందులోనూ కుక్క ముఖంతో ఉన్న ఈ వింత పాము భారతదేశంలోని ఓ నదిజలాల్లో కనిపించింది. అస్సలు సముద్రమే లేని అసోం రాష్ట్రంలోని కనిపించడం మరీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడు దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇంతకీ ఈ కుక్క ముఖం ఉన్న వింత సముద్ర పాము విశేషాలు పూర్తిగా తెలుసుకుందాం..
సముద్రంలో నివసించే పాములు అడవుల్లోని వరద మైదానాల్లో ఉండటం ఎప్పుడైనా చూశారు.. ఈ ఆశ్చర్యకరమైన దృశ్యం అస్సాంలోని నల్బరీ జిల్లాలో కనిపించింది. ఈశాన్య భారతంలో మొదటి సారి కుక్క ముఖం పాము కనిపించింది. దీనిని సెర్బెరస్ రిన్ చాప్స్ అంటారు. తెలుగులో నీటిపాము అంటారు.
ALSO READ | నయంకాని వ్యాధితో క్షీణించిన ఆరోగ్యం.. కార్బన్ మోనాక్సైడ్ పీల్చి వ్యక్తి ఆత్మహత్య..
ఈ పామును సముద్ర పాముల నిపుణుడు జయదిత్య పుర్కాయస్థ ,అతని బృందం గరేమారా గ్రామంలోని వరద కాల్వల్లో దీనిని గుర్తించారు. ఈ బృందం అద్బుతమైన అన్వేషణను శాస్త్రవేత్తలను ఆశ్చర్యపర్చింది. దీనికి సంబంధించిన వివరాలను ది జర్నల్ రెప్టైల్స్ అండ్ యాంఫిబియన్స్ జర్నల్ లో ప్రచురించారు.
ఈ కుక్కముఖం పాము గురించి..
ఇది సాధారణ పాము కాదు.. దీనిని సెర్బెరస్ రిన్ చాప్ష్ అంటారు. అంత విషపూరితం కాని సెమీజల జాతి పాము. ఉప్పునీటిలో పెరుగుతుంది. చేపలు, క్రస్టేసియన్లను తిని బతుకుతుంది. ఈ పాములు సాధారణంగా దక్షిణ, ఆగ్నేషియా అంతటా మడ అడవులు, తీర ప్రాంత బుదర మైదనాలు, నదీ ముఖ ద్వారాల్లో కనిపిస్తుంది.
భారతదేశంలో, ఇది గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ , అండమాన్ నికోబార్ దీవులు వంటి తీరప్రాంతాలలో జీవిస్తాయి. అయితే ఇప్పటివరకు లోతట్టు ప్రాంతాలలో కనిపించలేదు. అకస్మాత్తుగా అసోంలో కనిపించడంతో శాస్త్రవేత్తలను అయోమయంలో పడేసింది.