ఎవరైనా ముందుకు స్కేటింగ్ చేయడం సర్వసాధారణం. కానీ హైదరాబాద్కు చెందిన కోట నవీన్ దంపతుల కుమారులు రాజేశ్‌కుమార్(12), ఉమేశ్‌కుమార్(11) వరల్డ్ రికార్డ్ ను కోసం తొమ్మిది నెలలు కఠోర శ్రమపడి బ్యాక్ స్కేటింగ్ చేస్తున్నారు. 300 కిలోమీటర్ల మేర బ్యాక్ స్కేటింగ్ చేయాలనే దృఢ సంకల్పంతో ఇద్దరూ గురువారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ సమీపంలోని రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి ప్రారంభమై సాయంత్రం ఖమ్మం చేరుకున్నారు. వీరు బ్యాక్ స్కేటింగ్ చేస్తూనే ప్రజల్లో సామాజిక స్పృహను నెలకొల్పేందుకు ‘సేవ్ గర్ల్స్, డోంట్ డ్రంక్ అండ్ డ్రగ్స్’ అనే నినాదాలు ప్రదర్శిస్తున్నారు. వీరు భద్రాచలం వరకు వెళ్లనున్నట్లు తెలిపారు.
వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం