వావ్ అమేజింగ్.. బ్లాక్ టైగర్స్.. ఇంటర్నెట్ లో వైరల్..

వావ్ అమేజింగ్.. బ్లాక్ టైగర్స్.. ఇంటర్నెట్ లో వైరల్..

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి పర్వీన్ కస్వాన్ ఒడిశాలోని సిమిలిపాల్‌లో కనిపించిన మనోహరమైన 'సూడో-మెలనిస్టిక్' పులుల చిత్రాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పంచుకున్నారు. ఈ ఫొటోలు ఇంటర్నెట్‌ యూజర్స్ ను విస్మయానికి గురిచేస్తున్నాయి. దాంతో పాటు భారతదేశంలోని నల్ల పులులు.. సిమిలిపాల్‌లో నకిలీ-మెలనిస్టిక్ పులులు ఉన్నాయని మీకు తెలుసా. అవి జన్యు పరివర్తన కారణంగా, చాలా అరుదుగా కనిపిస్తాయని, అందమైన జీవి అంటూ ఆయన క్యాప్షన్ లో రాసుకొచ్చారు.

ఈ పులుల గురించి పర్వీన్ కస్వాన్ కొన్ని వాస్తవాలను కూడా పంచుకున్నారు. సిమిలిపాల్‌లో ప్రసిద్ధి చెందిన నకిలీ-మెలనిస్టిక్ పులులను మొదటి సారిగా 1993లో గుర్తించారన్నారు. 21 జూలై 1993 సల్కు, పొడగాడ్ గ్రామానికి చెందిన ఒక చిన్న పిల్లవాడు ఆత్మరక్షణ కోసం బాణాలతో 'నల్ల'పులిని కాల్చి చంపాడని చెప్పారు. ఈ అరుదైన పులులు మొదటిసారిగా 2007లో STRలో అధికారికంగా కనుగొన్నారని చెప్పారు. అవి అరుదైన జన్యు పరివర్తన కారణంగా వాటి జనాభా కూడా తక్కువేనన్నారు.

లక్షకు పైగా వ్యూస్

డిసెంబర్ 22న చేసిన ఈ పోస్ట్ కు ఇప్పటివరకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు కూడా ఈ పోస్ట్ పై స్పందిస్తూ కామెంట్స్ బాక్స్ ను నింపేశారు. ఇది చాలా అందంగా ఉందని, రాత్రి సమయంలో వీటిని గుర్తించడం కష్టమని.. ఇలా పలు రకాలుగా రాసుకొచ్చారు. మరికొందరు మాత్రం ఈ దృశ్యాన్ని చూసి తమ విస్మయాన్ని వ్యక్తం చేశారు.