హనుమాస్ పల్లి ఎర్త్  సెంటర్​లో అరుదైన కప్ప

 హనుమాస్ పల్లి ఎర్త్  సెంటర్​లో అరుదైన కప్ప

ఆమనగల్లు, వెలుగు: కడ్తాల్  మండలం హనుమాస్ పల్లి ఎర్త్  సెంటర్ లో గురువారం అరుదైన పాలరాతి బుడగల కప్ప ప్రత్యక్షమైనది. కప్పల్లో ఇది అరుదైన జాతికి చెందిన జీవి అని, వేసవిలో నెల రోజులు భూమి అంతర్భాగంలో సుప్తావస్థలో  ఉంటుంది.

దీని చర్మం ఎంతో సున్నితంగా, అందంగా కనిపిస్తుంది. ఈ రకానికి చెందిన కప్పలు అరుదుగా కనిపిస్తాయని కౌన్సిల్  ఫర్  గ్రీన్  రెవల్యూషన్  ప్రతినిధి, జంతుశాస్త్ర విద్యార్థి జ్ఞానేశ్వర్  చెప్పారు. అరుదైన కప్ప ఎర్త్  సెంటర్ లో ప్రత్యక్షం కావడం పట్ల సంస్థ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.