కాంటినెంటల్ హాస్పిటల్​లో అరుదైన సర్జరీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: నానక్​రామ్​గూడలోని కాంటినెంటల్ హాస్పిటల్​డాక్టర్లు ఓ అరుదైన సర్జరీ చేయడంలో సక్సెస్​ అయ్యారు. సౌత్​ఇండియాలో మొదటిసారి ట్రాన్స్​ఓరల్​రోబోటిక్​సర్జరీ చేసిన ఘనత సాధించారు. అసదుల్లా(62) అనే పేషెంట్ కొంత కాలంగా ఓరో ఫారింజియల్​అనే క్యాన్సర్​తో బాధపడుతున్నాడు. 

పలు హాస్పిటళ్లలో కీమోథెరపీ, రేడియేషన్ చేయించుకున్నాడు. ఇటీవలకాంటినెంటల్​ హాస్పిటల్​కు వచ్చిన ఆయనకు డాక్టర్లు ట్రాన్స్​ఓరల్​ రోబోటిక్ ​సర్జరీ చేసి క్యాన్సర్​నుంచి విముక్తి కల్పించారు. ఈ చికిత్సలో దవడ ఎముక భాగంతోపాటు నాలుకను తొలగించేవారు. 

ఇలా చేస్తే ఆపరేషన్​తర్వాత పేషెంట్లు​చాలా ఇబ్బందులు పడతారు. కాంటినెంటల్ డాక్టర్లు ట్రాన్స్​ఓరల్ ​రోబోటిక్ ​సర్జరీతో సెంటీమీటర్ ​మార్జిన్​తో సక్సెస్​ చేశారు.