మల్యాల మండలంలో రెండు తలలతో కోడిపిల్ల

మల్యాల మండలంలో రెండు తలలతో కోడిపిల్ల

మల్యాల, వెలుగు: జన్యు లోపంతో ఓ కోడి పిల్ల రెండు తలలతో పుట్టింది. మల్యాల మండలంలో ముత్యంపేట గ్రామ పరిధిలోని కొండగట్టుకు చెందిన సిక్కుల శారద తాను పెంచుకుంటున్న కోడిని పొదిగేసింది. సోమవారం పొదిగేసిన గుడ్లను పరిశీలించగా అందులో ఓ కోడి పిల్ల రెండు తలకాయలతో పుట్టింది. సాయంత్రం ఆ కోడిపిల్ల చనిపోయినట్లు శారద తెలిపారు.