Rare US snowstorm: అమెరికాలో మంచు తుఫాను..2వేలవిమానాలు రద్దు, పాఠశాలలు బంద్

Rare US snowstorm: అమెరికాలో మంచు తుఫాను..2వేలవిమానాలు రద్దు, పాఠశాలలు బంద్

అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. టెక్సాస్, లూసియానా, మిస్సిసిప్పి, అలబామా, జార్జియా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో 10 ఇంచుల మేర మంచు పేరుకుపోయింది. ఈ అసాధారణ తుఫానుతో రోడ్లు మంచుతో కప్పబడ్డాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విమానాలు రద్దు చేయబడ్డాయి. అమెరికా వ్యాప్తంగా 2వేల100 విమానాను రద్దు చేశారు. అన్ని పాఠశాలలు మూసివేశారు. చరిత్రలో కనివినీ ఎరుగనీ రీతిలో దక్షిణ అమెరికాను అతలాకుతలం చేసింది. ఇంత పెద్ద ఎత్తున మంచు తుఫాన్ సంభవించడం 62యేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 

చలి తీవ్రత కారణంగా టెక్సాస్, జార్జియా, మిల్వాకీలలో నలుగురు వ్యక్తులు చనిపోయారు. మంగళ, బుధవారాల్లో పోర్టులో ఎగుమతులు, దిగుమతులు బంద్ చేశారు. లూసియానాలోని న్యూ ఓర్లీన్స్ చుట్టూ భారీ ఎత్తున మంచు తుఫాను కురిసింది. ఈ ప్రాంతంలో 1963 తర్వాత వచ్చి అతిపెద్ద హిమపాతం అని అధికారులు చెబుతున్నారు. 

లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ న్యూ ఓర్లీన్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చాలా ఎయిర్ లైన్స్ తమ విమానాలను రద్దు చేశాయి. లూసియానాలో పాఠశాలలు, స్టేట్ ఆఫీసులు మూసివేయబడ్డాయి. హ్యూస్టన్ నుండి న్యూ ఓర్లీన్స్ వరకుజార్జియాలోని కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లు మూతపడ్డాయి. 

మంచుతుఫానుపై లూసియాన్ గవర్నర్ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. వచ్చే ఏడు రోజుల్లో చలి ప్రమాదకరంగా మారనుందని అన్నారు. మంచు తీవ్రత ఎక్కువగా ఉంది.. ఇండ్లనుంచి బయటికి రావొద్దని సూచించారు.