అలంపూర్ సమీపంలోని తుంగభద్రలో నీటి కుక్కల సందడి

 అలంపూర్ సమీపంలోని తుంగభద్రలో నీటి కుక్కల సందడి

అలంపూర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్  సమీపంలోని తుంగభద్ర నదిలో నీటి కుక్కలు సందడి చేశాయి. స్థానికులు వీటిని వింతగా చూడగా, వాటి గురించి మత్స్యకారులు వారికి వివరించారు. నీటి కుక్కలు అరుదుగా కనిపిస్తాయని, నీటిలో ఉంటూ చేపలను తింటాయని పేర్కొన్నారు.

వలకు చిక్కితే.. వలను చింపేస్తాయని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వాగులు, కుంటల్లో కనిపించే నీటి కుక్కలు.. వేసవికాలంలో కనిపించడంతో స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల ప్రజలు వాటిని చూసేందుకు ఆసక్తి చూపారు