చివరిసారిగా 1970లో.. మళ్లీ ఇప్పుడు..
సూరత్: లాక్ డౌన్ ఎఫెక్ట్ తో అరుదైన జంతువులు అడవి నుంచి బయటకు వస్తున్నాయి. అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేరిన అడవి కుక్క డోల్… 50 ఏండ్ల తర్వాత మళ్లీ కనిపించింది. గుజరాత్ సూరత్ లోని వాన్స్ డా నేషనల్ పార్క్ లో కెమెరాకు చిక్కింది. ఇది చివరిసారిగా 1970 లో కనిపించింది. అరుదైన ఆసియా అడవి కుక్క అయిన డోల్… ఒక రకమైన ఈల లాంటి శబ్దం చేస్తుంది. అందుకే దీనికి ఈల వేయు కుక్క అని పేరొచ్చింది. ‘‘మొదట లోకల్ బర్డ్ వాచర్ మహమ్మద్ జాట్ ఫిబ్రవరి 20న డోల్‌ను చూశానని చెప్పాడు. అడవిలో ఒక జింక చనిపోగా, దాన్ని చంపిన విధానాన్ని బట్టి డోల్ అక్కడుందని గుర్తించాం. తర్వాత కెమెరాలను ఫిక్స్ చేయగా, అడవి కుక్క ఇమేజెస్‌ను అవి క్యాప్చర్ చేశాయి. అయితే ఎన్ని కుక్కలు ఉన్నాయనేది మాత్రం తెలియదు’’ అని డిప్యూటీ కన్జర్వేటర్ దినేశ్ రాబరి తెలిపారు.
For More News..