కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అరుదైన అడవి కుక్కలు ఫారెస్ట్ అధికారుల కంట పడ్డాయి. అంతరించిపోతున్న ఈ ఇండియన్ వైల్డ్ డాగ్స్ తాజాగా పెంచికల్ పేట్ అడువుల్లో కనిపించాయి. కమ్మర్గాం , మురళిగూడ మధ్య అటవీ ప్రాంతంలో మూడు అడవి కుక్కలు చెరువులో నీరు తాగుతున్నాయి. అటుగా వెళ్తున్న యువకులు వాటిని చూసి వీడియో తీశారు. పెంచికల్ పేట్ రేంజ్ పరిధిలో సుమారుగా 5-10 ఏషియన్ వైల్డ్ డాగ్స్ ఉన్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. కానీ అవి ఎప్పుడూ సామాన్యుల కంట పడవు. ఇవి పులులను సైతం ఎదిరిస్తాయట. స్పీడ్, ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండటం వీటి లక్ష్యం.
ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పెట్ రేంజ్ లో అరుదైన అడవి కుక్కలు.. ఏషియన్ వైల్డ్ డాగ్స్ గా ప్రాచుర్యం పొందిన ఈ కుక్కలు సామాన్యంగా జనాలకి కనిపించవు.. కుమ్మర్గాo, మురలిగూడ మధ్య అడవి ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు వీటిని గుర్తించారు. pic.twitter.com/A1cW35zJE1
— Mr. Mohan (@kundenapally_12) November 22, 2024