రసాభాసగా కోరుట్ల బడ్జెట్ మీటింగ్​

కోరుట్ల, వెలుగు: కోరుట్ల బడ్జెట్​ మీటింగ్​ రసాభాసగా మారింది. మంగళవారం కోరుట్ల బల్దియాలో చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ అన్నం లావణ్య అధ్యక్షతన 2024-–25 బడ్జెట్​ మీటింగ్ నిర్వహించారు. బడ్జెట్‌‌‌‌‌‌‌‌లోని 4,6, 10,12 అంశాలతోపాటు టేబుల్‌‌‌‌‌‌‌‌ ఎజెండాను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ  వైస్ చైర్మన్ గడ్డమీద పవన్‌‌‌‌‌‌‌‌తోపాటు పలువురు కౌన్సిలర్లు పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.  అనంతరం పలు సమస్యలపై నిలదీశారు. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేసి బల్దియా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. 

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి బల్దియా బడ్జెట్ రూ.18.76 కోట్లు

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: మెట్‌‌‌‌‌‌‌‌పల్లి బల్దియా 2024–25 ముసాయిదా బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. మంగళవారం చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్  రణవేని సుజాత అధ్యక్షతన బల్దియా ఆఫీసులో బడ్జెట్​సమావేశం నిర్వహించారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌కు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్​ హాజరయ్యారు. వివిధ గ్రాంట్లతో కలిపి అంచనా ఆదాయం  రూ.18 కోట్ల 89 లక్షల 54 వేలుగా నిర్ధారించి, అంచనా వ్యయం కూడా అంతే మొత్తంగా పొందుపర్చారు. ఈ మేరకు అధికారులు బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను చదివి వినిపించారు.