కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు చేదు అనుభవం ఎదురైంది. వడ్లూరు గ్రామానికి చెందిన వ్యక్తి.. రసమయికి ఫోన్ చేసి రాజీనామా చేయాలని కోరాడు. మీరు రాజీనామా చేస్తే నియోజకవర్గంలో అభవృద్ధి జరుగుతుందని చెప్పాడు. ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నా అని కూడా ఆలోచించకుండా.. తాను చెప్పాలనుకున్న మాటను సూటిగా చెప్పేశాడు. ఎన్నికలప్పుడు వచ్చి హామీలు ఇచ్చి.. తర్వాత పట్టించుకోలేదని ఆ వ్యక్తి ఆరోపించాడు. అందుకు బదులిస్తూ.. ముందు బండి సంజయ్‌తో రాజీనామా చేయిస్తే.. ఇంకా అభివృద్ధి జరుగుతుందని రసమయి సమాధానం ఇచ్చాడు.
అయితే గతంలో కూడా రసమయి బాలకిషన్‌కు ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయి. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉపఎన్నికలు చూసిన తర్వాత.. ప్రజలు ఉప ఎన్నికలు వస్తేనే నియోజకవర్గాల్లో అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నారు. అభివృద్ది జరగకున్నా ఓటు కోసం రాజకీయ పార్టీల నుంచి డబ్బులు వస్తాయని ఆశపడుతున్నారు.