ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్లో ఫేమస్ అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా(Rashi Khanna). నటిగానే కాకుండా అందం విషయంలోనూ అందరి ప్రశంసలు అందుకునే విధంగా..ఈ అమ్మడు కెరీర్ ఆరంభంలోనే చాలా కష్టపడి బరువు తగ్గిన విషయం తెల్సిందే.
రాశి ఖన్నా టైర్ 2 హీరోలకు మోస్ట్ వాంటెడ్‌గా వరుస సినిమాలు చేసింది.
ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు టాలీవుడ్‌లో మాత్రం కాస్త స్లో అయిందని చెప్పాలి. ప్రస్తుతం నీరజ కోన(Neeraja Kona) తెరకెక్కిస్తోన్న తెలుసు కదా (Telusu kada) మూవీలో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)తో నటించనుంది. అలాగే మరో రెండు తెలుగు సినిమాల చర్చలు జరుగుతున్నాయని..అవేంటో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
రెగ్యులర్‌గా ఈ అందాల రాశి తన అందమైన ఫొటోలను తన ఫాలోవర్స్కి సోషల్ మీడియా జనాలకు ఎంటర్‌టైన్ చేసేందుకు గాను షేర్ చేస్తూ ఉంటుంది. ఈసారి బ్లాక్ అండ్ వైట్ పిక్స్‌ను షేర్ చేసిన రాశి ఖన్నా పులి చర్మం మాదిరిగా ఉన్న ఒక డిజైనర్ డ్రెస్ ను ధరించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ రేంజ్ అందం కేవలం అందాల రాశి కే సొంతం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.