నాగ చైతన్య థాంక్యూ మూవీ తర్వాత రాశీ ఖన్నా (Rashi Khanna) తెలుగులో కనిపించని విషయం తెలిసిందే. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ టూ బాలీవుడ్ రౌండ్లు వేస్తోంది. ఇప్పుడు ఎక్కువగా ఆ రెండు పరిశ్రమల చుట్టే చక్కర్లు కొడుతోంది. అప్పుడప్పుడు అమ్మడి ఫొటోలు ఇన్ స్టాలో చూసి తెలుగు ఆడియన్స్ మురిసిపోవడం తప్ప హైదరాబాద్ లో రాశీ కనిపించింది లేదు.
దీంతో రాశీని టాలీవుడ్ ఆడియన్స్ కూడా దాదాపు మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. దగ్గరగా పరిశీలిస్తే తప్ప ఆమె రాశీఖన్నా అని గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. సన్న తీగలా మారిపోయింది. చబ్బీ లుక్ నుంచి ఎప్పుడో బయటపడింది కానీ ఇప్పుడు మరింత స్లిమ్ అయింది. ఈ స్లిమ్ లుక్ లో అమ్మడు మరింత అందంగా కనిపిస్తోంది. ఓ కొత్త రాశీని చూస్తున్న అనుభూతి కలుగుతుందని రాశీ ట్రాన్స్ ఫర్మేషన్ చూసి అభిమానులే షాక్ అవుతున్నారు. అమె రాశీ ఖన్నానా లేక ఆమె చెల్లెలా అని డౌట్ పడుతున్నారు.
ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వస్తోన్న తెలుసు కదా మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే హిందీ, తమిళ భాషల్లో మరో నాలుగైదు సినిమాలు వరుసగా ఉన్నాయి.