T20 World Cup 2024: అతడి విధ్వంసానికి నిద్ర లేని రాత్రులు గడిపాను: రషీద్ ఖాన్

T20 World Cup 2024: అతడి విధ్వంసానికి నిద్ర లేని రాత్రులు గడిపాను: రషీద్ ఖాన్

టీ20 వరల్డ్ కప్ లో ప్రతిసారి లాగే ఈ సారి కూడా ఆఫ్ఘనిస్తాన్ అండర్ డాగ్ గా బరిలోకి దిగుతోంది. అయితే తమదైన రోజున ఎంత పెద్ద జట్టుకైనా ఆఫ్గన్లు అగ్ర శ్రేణి జట్లకు సైతం షాక్ ఇవ్వగలదు. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్, శ్రీలంక, పాకిస్థాన్ జట్లను ఓడించి సంచలనం సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. చివరి వరకు సెమీస్ రేస్ లో నిలిచింది. తమను తక్కువగా అంచానా వేస్తే ఎంత పెద్ద జట్టుకైనా ఓటమి తప్పదని చెప్పకనే చెప్పింది.

జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికాలో జరగబోయే పొట్టి సమరానికి ముందు రషీద్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ సారి ఆఫ్ఘనిస్తాన్ జట్టు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉందని చెప్పాడు. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటనను గుర్తు చేసుకున్నాడు. తనకు వరల్డ్ కప్ అనగానే భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో మ్యాక్స్ వెల్ తమ జట్టుపై ఆడిన ఇన్నింగ్స్ గుర్తొస్తుందని రషీద్ అన్నాడు. మ్యాక్సీ ఇన్నింగ్స్ ఇంకా తన కళ్ళ ముందే మెదులుతోందని.. అతని ఇన్నింగ్స్ గుర్తొస్తే ఇప్పటికీ నిద్ర పట్టదని ఈ ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే 291 పరుగుల ఛేదనలో ఒకదశలో ఆసీస్ 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. ఈ దశలో నమ్మశక్యం కానీ ఇన్నింగ్స్ ఆడుతూ డబుల్ సెంచరీ బాదేశాడు. 128 బంతుల్లో 201 నాటౌట్) 21 ఫోర్లు, 10 సిక్సులు బాదిన మాక్సీ.. ఒంటి చేత్తో కంగారూల జట్టును విజయతీరాలకు చేర్చాడు. జూన్ 4 న ఉగాండాతో ఆఫ్ఘనిస్తాన్ తమ తొలి మ్యాచ్ తో టీ20 వరల్డ్ కప్ ప్రారంభిస్తుంది.