అఫ్ఘానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 500 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్లో రషీద్ ఖాన్ ఈ రికార్డు క్రియేట్ చేశాడు. ప్రిటోరియా క్యాపిటల్స్- ముంబయ్ కేప్ టౌన్ మధ్య జరిగిన మ్యాచ్లో రషీద్ టీ20 లో తన 500వ వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు.
సౌతాఫ్రికా టీ20 లీగ్లో రషీద్ ఖాన్ ముంబై కేప్ టౌన్కు ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో3 వికెట్లు తీయటంతో 500 వికెట్ల క్లబ్లో చేరాడు. 8 ఏళ్ల క్రితం టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన రషీద్ ఖాన్..371 మ్యాచుల్లో 368 ఇన్నింగ్స్ ఆడి 500 వికెట్లు పడగొట్టాడు. బెస్ట్ 17 పరుగులకు 6 వికెట్లు.
టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. అతను556 మ్యాచుల్లో 526 ఇన్నింగ్స్‌లలో 614 వికెట్లు దక్కించుకున్నాడు. అత్యుత్తమ బౌలింగ్ 23 పరుగులకు 5 వికెట్లు. రెండో స్థానంలో 500 వికెట్లతో రషీద్ ఉన్నాడు. 474 వికెట్లతో సునీల్ నరైన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇమ్రాన్ తాహిర్ 466, షకీబ్ అల్ హసన్ 436 వికెట్లతో 4, 5 స్థానాల్లో ఉన్నారు.