ఏ దేశం వెళ్లినా పాకిస్థాన్ క్రికెట్ జట్టు తమ చేష్టలతో వార్తలతో నిలుస్తూ ఉంటుంది. మైదానంలోనే కాదు బయట వీరు తీరు విచిత్రంగా ఉంటుంది. తాజాగా అలాంటి సంఘటన ఒకటి చేటు చేసుకుంది. వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు న్యూయార్క్ లో ఉంది. గురువారం (జూన్ 6) అమెరికాతో తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉంది. అమెరికాలోని డల్లాస్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే మంగళవారం (జూన్ 4) పాక్ చేసిన ఒక పని వైరల్ అవుతుంది.
న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్‌లో 25 డాలర్ల ఫీజుతో పాక్ జట్టు, మేనేజ్‌మెంట్ కలిసి.. పాక్ ఆటగాళ్లతో 'మీట్ అండ్ గ్రీట్' నిర్వహించినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం 25 US డాలర్ల డబ్బు చెల్లిస్తే ప్రైవేట్ డిన్నర్ లో పాక్ ఆటగాళ్లను కలవటానికి అనుమతి లభిస్తుంది. తాజాగా ఈ వీడియోను పాక్ మాజీ వికెట్ కీపర్ లతీఫ్ బయట పెట్టి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ ప్రైవేట్ విందును ఏర్పాటు చేసిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై విమర్శలు గుప్పించారు.
కమ్రాన్ ముజాఫర్ హోస్ట్ చేసిన ఒక షోలో లతీఫ్ తో పాటు పాకిస్తాన్ టెలివిజన్ వ్యక్తి, క్రికెట్ కరస్పాండెంట్, నౌమన్ నియాజ్ కూడా ఉన్నారు. రషీద్ లతీఫ్ మాట్లాడుతూ.. “డిన్నర్ పార్టీలు నిర్వహించాలనుకుంటే అధికారికంగా ఏర్పాటు చేయాలి. అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ప్రైవేట్ పార్టీలు నిర్వహించడం అవమానకరం. ఈ సంఘటన భయంకరమైనది. అక్కడ ఏమైనా గందరగోళం జరిగి ఉంటే.. పాక్ క్రికెటర్లు డబ్బు సంపాదించడం కోసం ఈ పని చేస్తున్నారని అనేవారు". అని ఈ కార్యక్రమంలో లతీఫ్ అన్నారు.
Let’s Save The Star & Be Stars
— Rashid Latif | 🇵🇰 (@iRashidLatif68) June 4, 2024
Unofficial Private Dinner During WC24#T20WorldCup pic.twitter.com/BXEgPyA2p2