కాబోయే వాడిని పరిచయం చేసిన రష్మీ? అవాక్కవుతున్న ఆడియన్స్

కాబోయే వాడిని పరిచయం చేసిన రష్మీ? అవాక్కవుతున్న ఆడియన్స్

బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ(Anchor Rashmi) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ఒరిస్సా బ్యూటీ.. ప్రస్తుతం స్టార్ యాంకర్ గా తన హవాను కొనసాగిస్తోంది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ తనదైన శైలీలో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తోంది.

ఇదిలా ఉంటే.. కొంతకాలంగా రష్మీ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె తన సొంత ఊరు ఒరిస్సాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుంది అంటూ న్యూస్ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఒక అడుగు ముందుకు వేస్తూ.. తాను చేసుకోబోయేవాడిని పరిచయం చేసింది రష్మీ. కొత్త సంవత్సరం సందర్భంగా రష్మి పెళ్లి పార్టీ పేరుతో ఓ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ ప్రోగ్రాం ప్రోను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ ఎప్పటిలాగే ఎంతో హుషారుగా సాగింది. బాబా భాస్కర్, తాగుబోతు రమేష్, హైపర్ అది, రష్మీ, శ్రీసత్య, చమ్మక్ చంద్ర ఇలా చాలా మంది సెలబ్రెటీలు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా హైపర్ ఆది మరోసారి రష్మీ పెళ్లి విషయాన్ని తెరపైకి తెచ్చాడు. ఇన్ని రోజులుగా ఎదో టీఆర్పీ కోసం సుధీర్ ప్రేమ అంటూ చేశావు కానీ.. ఇప్పుడు నిజం చెప్పు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు? అని అందరిముందే అడిగేశాడు. 

దానికి కాస్త సిగ్గుపడిన రష్మీ.. నాకు కాబోయే భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అని చెబుతుండగానే.. ఆమె వెనకనుంచి ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అతడినే రష్మీ పెళ్లి చేసుకోబోతుందన్నట్లుగా ప్రోమో కట్ చేశారు. దీంతో ఈ ఎపిసోడ్ పై ఆసక్తి నెలకొంది. ఆ అబ్బాయి ఎవరు? రష్మీ నిజంగా అతడిని పెళ్లి చేసుకుంటుందా? మరి సుధీర్ పరిస్థితి ఏంటి? అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. మరి ఆ డీటెయిల్స్ ఏంటో తెలియాలి అంటే డిసెంబర్ 31 వరకు ఆగాల్సిందే.