ఆర్జీవి మేనకోడలి పెళ్ళిలో సందడి చేసిన రష్మిక, విజయ్ దేవరకొండ

ఆర్జీవి మేనకోడలి పెళ్ళిలో సందడి చేసిన రష్మిక, విజయ్ దేవరకొండ

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మేనకోడలు, సెలబ్రెటీ ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మ శనివారం (నవంబర్ 9) వివాహం ఘనంగా జరిగింది. కాగా ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్, శ్రావ్య వర్మ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 

ఇటీవలే వీరువురి పెళ్ళికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హైదరాబాద్ లోని ఓ ప్రముఖ రిసార్ట్ లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. శ్రావ్య పెళ్లికి టాలీవుడ్ ప్రముఖ సినీ సెలెబ్రెటీలైన రష్మిక మందాన, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్ తదితరులతోపాటూ తమిళ్ హీరోలు ధృవ్, విక్రమ్ కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 

అయితే శ్రావ్య వర్మ పలువురు టాలీవుడ్ సెలెబ్రెటీస్ కి ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసింది. ఈ క్రమంలో నటి రష్మికతో మంచి అనుబంధం ఏర్పడింది. దీంతో రష్మిక శ్రావ్య పెళ్ళిలో సందడి చేసింది. అలాగే సోషల్ మీడియాలో కూడా శ్రావ్య, శ్రీకాంత్ ఫోటోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది.