
బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాల్లో నటిస్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందాన్న(Rashmika Mandanna). గడిచిన ఈ రెండేళ్లలో యానిమల్, పుష్ప 2, ఛావా మూవీలతో సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది.
అయితే ఇటీవల వచ్చిన సికిందర్ చిత్రంతో నిరాశపరచింది. ఆ తర్వాత ఈ అమ్మడు కాస్త గ్యాప్ తీసుకుని ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రష్మిక హిందీలో ప్రస్తుతం రెండు పెద్ద సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది.
ఇదిలా ఉంటే.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మిక.. లేటెస్టుగా పూల గురించి X లో పోస్ట్ పెట్టింది. ‘నువ్వు చివరిసారిగా ఎప్పుడు పువ్వులు కొనుక్కున్నావు? నిన్ను నువ్వు తరచుగా అభినందించుకోవడానికి, కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఒక సున్నితమైన జ్ఞాపకం పూలు. ఎందుకంటే ప్రపంచంలోని ప్రేమ, దయ అంతా పూలకు అర్హం' అంటూ పూలపై తన ప్రేమను కనబర్చింది. ఇపుడీ ఈబ్యూటీ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
When was the last time you got yourself flowers? 🌸 Just a gentle reminder to appreciate and thank yourself often... because you deserve all the love and kindness in the world. ❤️ pic.twitter.com/aaLwfiCIhp
— Rashmika Mandanna (@iamRashmika) April 20, 2025
వెచ్చని చిరునవ్వు, ఆ ముఖంలో మెరుపు మరియు ఎర్రబడిన బుగ్గలు చూస్తుంటే.. ఈ గులాబీని బహుశా విజయ్ దేవరకొండ బహుమతిగా ఇచ్చారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక ఇచ్చే ఎక్సప్రెషన్స్ వెనుక విజయ్ ఉన్నాడని ఇరువురి ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎందుకంటే, వీరిద్దరి మధ్య లోతైన ప్రేమ దాగుందని ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉన్నాయి. దానికితోడు నిరంతరం డేటింగ్ రూమర్స్ కూడా వస్తుండటం మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఇక అప్పుడప్పుడు ఇలా సర్ప్రైజింగ్ పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తూ వస్తున్నారు.
‘ది గర్ల్ ఫ్రెండ్’:
రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’చిత్రంలో రష్మికకి జంటగా దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి.
ఈ మూవీ మే 19న రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున నటిస్తున్న ‘కుబేర’చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది జూన్ 20న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది.