లక్కీగా లక్ష్మీ కటాక్షం

లక్కీగా లక్ష్మీ కటాక్షం

వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది రష్మిక మందన్న.  ఆమె నటిస్తున్న చిత్రాల్లో ‘కుబేర’ కూడా ఒకటి.  ధనుష్,  నాగార్జున లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నాడు.  శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రంలోని ధనుష్, నాగార్జున పాత్రలను పరిచయం చేసిన మేకర్స్.. శుక్రవారం రష్మిక క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ.. వీడియో గ్లింప్స్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఆమె పింక్ చుడీదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  సాధారణ మహిళగా ఇంటెన్స్ లుక్‌‌‌‌‌‌‌‌లో ఆకట్టుకుంది. ఓ మారుమూల ప్రాంతంలో దాచిన సూట్‌‌‌‌‌‌‌‌కేస్‌‌‌‌‌‌‌‌ను తవ్వి.. అందులో ఉన్న డబ్బులకు మొక్కి తీసుకెళ్తున్న వీడియో సినిమాపై ఇంటరెస్ట్‌‌‌‌‌‌‌‌ని క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాలో జిమ్ సర్ఫ్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో షూటింగ్  జరుగుతోంది.