గర్ల్ ఫ్రెండ్ మూవీ నుంచి రష్మిక లుక్ రిలీజ్

గర్ల్ ఫ్రెండ్ మూవీ నుంచి రష్మిక లుక్ రిలీజ్

పుష్ప2, ఛావా లాంటి వరుస బ్లాక్ బస్టర్స్‌‌ అందుకుని ఫుల్ జోష్‌‌లో ఉంది రష్మిక మందన్నా. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్  సినిమాల్లో నటిస్తోంది. శనివారం ఆమె పుట్టినరోజు  సందర్భంగా తను లీడ్ రోల్‌‌లో నటిస్తున్న ‘గర్ల్ ఫ్రెండ్’ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌‌‌‌తో పాటు  లిరికల్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌‌‌‌లో రష్మిక  వారియర్ లుక్‌‌లో గన్, కత్తి పట్టుకుని  పవర్‌‌‌‌ఫుల్‌‌గా కనిపిస్తోంది. ‘రేయి లోలోతుల’ అంటూ సాగే ఆడియో టీజర్ ఇంప్రెస్ చేస్తోంది. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్  కంపోజ్ చేయగా, రాకేందు మౌళి క్యాచీ లిరిక్స్ రాశాడు.  విజయ్ దేవరకొండ, హేషమ్ అబ్దుల్ వాహబ్, చిన్మయి శ్రీపాద ఆకట్టుకునేలా పాడారు. 

ఈ పాటలో వచ్చే పోయెమ్‌‌ను మూవీ డైరెక్టర్  రాహుల్ రవీంద్రన్ రాశాడు.  ‘రేయి లోలోతుల సితార, జాబిలి జాతర, కన్నులలో వెన్నెలలే కురిసే, మదిమోసే తలవాకిట తడిసే, యెద జారెనే మనసు ఊగెనే, చెలి చెంతలో జగమాగెనే, యెద జారెనే మనసా..’ అంటూ మంచి లవ్ ఫీల్‌‌తో సాగుతుందీ  పాట. ఈ చిత్రంలో రష్మికకు జంటగా దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. 

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ బ్యానర్స్‌‌పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు.  ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా,  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేయనున్నారు.