బాలీవుడ్ హర్రర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక..

బాలీవుడ్ హర్రర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక..

కన్నడ స్టార్ హీరోయిన్ రష్మిక మందాన బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ దక్కించుకుంది. హిందీ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న "థమ" అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాని బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ దినేష్ విజన్ డైరెక్ట్ చేస్తూ తన స్వంత బ్యానర్ అయిన మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. 

ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటులైన పరేష్ రావల్ మరియు నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. హార్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది దీపావళికి థమ సినిమా ని రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇందులో భాగంగా టైటిల్ టైటిల్ వీడియొ ని షేర్ రిలీజ్ చేశారు. 

Also Read :- జనక అయితే గనక ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అయితే గతంలో డైరెక్టర్ దినేష్ విజన్ 'స్త్రీ2' మరియు 'ముంజ్యా' వంటి హారర్-కామెడీ సినిమాలతో మంచి హిట్లు అందుకున్నాడు. దీంతో ఈసారి సరికొత్తగా హర్రర్ బ్యాక్ డ్రాప్ లో లవ్ & ఎమోషన్స్ ని చూపించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే దినేష్ విజన్ డైరెక్ట్ చేసిన స్త్రీ 2 సినిమా దాదాపుగా రూ.900 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. కోవిడ్ తర్వాత బాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాల్లో అత్యదిక కలెక్షన్లు సాధించిన వాటిలో స్త్రీ 2 మొదటి స్థానంలో నిలిచింది.