రామ్ చరణ్‌ జంటగా రష్మిక

రామ్ చరణ్‌ జంటగా రష్మిక

‘డియర్ కామ్రేడ్‌‌’ చిత్రంపై హిందీ ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు థ్యాంక్స్ చెప్పింది రష్మిక మందన్న. విజయ్, రష్మిక జంటగా భరత్ కమ్మ  తెరకెక్కించిన ఈ మూవీ హిందీ వెర్షన్‌‌ను యూబ్యూట్‌‌లో 400 మిలియన్ల మంది చూశారు.  విజయ్ షేర్ చేసిన ఈ పోస్ట్‌‌ను ఇన్‌‌ స్టాగ్రామ్‌‌లో పంచుకున్న రష్మిక.. తనకెప్పటికీ అత్యంత ప్రత్యేకమైన సినిమా ఇదని చెప్పింది.  ఇక ప్రస్తుతం అల్లు అర్జున్‌‌కు జంటగా ‘పుష్ప 2’లో నటిస్తోందామె.  సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉంది. అయితే అనుకోని కారణాలతో వాయిదా పడబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రామ్ చరణ్‌‌కు జంటగా రష్మిక ఓ సినిమాలో నటించబోతోందని సమాచారం. 

చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ  నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది.  అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్స్‌‌కు అవకాశం ఉందని, సినిమాకెంతో కీలకమైన  ఆ పాత్ర కోసం రష్మికను సంప్రదించినట్టుగా ప్రచారం జరుగుతోంది.  మరి ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌‌లో నటిస్తున్న రష్మిక, చరణ్‌‌కు జంటగానూ కనిపించనుందేమో చూడాలి!