![Rashmika Mandana: ఎమోషనల్ స్టోరీ షేర్ చేసిన రష్మిక.. అందుకే పుష్ప 2 ఈవెంట్ కి రాలేదా..?](https://static.v6velugu.com/uploads/2025/02/rashmika-mandana-shared-emotional-story-in-ins-about-pushpa-2-thank-you-meet_xOZikjzgb1.jpg)
నేషనల్ క్రష్ రష్మిక మందాన హీరోయిన్ గా నటించిన పుష్ప 2: ది రూల్ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఈ సినిమాలో రష్మిక హీరో భార్య శ్రీవల్లి పాత్రలో నటించింది. అయితే పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయిన పుష్ప 2 వరల్డ్ వైడ్ గా దాదాపుగా రూ.2000 కోట్లు పైగా కలెక్ట్ చేసి తెలుగులో బాహుబలి సినిమా రికార్డులని బద్దలు కొట్టింది. దీంతో చిత్ర యూనిట్ హైదరాబాద్ లో థాంక్ యూ మీట్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, ప్రొడ్యూసర్స్, ఇతర క్యాస్ట్ అండ్ క్రూ అటెండ్ అయ్యి పుష్ప 2 సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అభిమానులకి థాంక్స్ తెలిపారు. కానీ ఈ ఈవెంట్ కి రష్మిక మందాన రాలేదు.
అయితే రష్మిక ఇటీవలే షూటింగ్ లో గాయపడటంతో ఇంటిపట్టునే ఉంటూ రెస్ట్ తీసుకుంటోంది. ఈ కారణంగానే రష్మిక ఈ థాంక్ యూ ఈవెంట్ కి రానట్లు తెలుస్తోంది. అయితే రష్మిక సోషల్ మీడియా ద్వారా అభిమానులకి థాంక్స్ తెలిపింది. ఇందులోభాగంగా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ షేర్ చేసింది. ఇందులో సుకుమార్, బన్నీ ని ట్యాగ్ చేస్తూ ధన్యవాదాలు తెలిపింది. అలాగే ఈ సినిమా తీసేందుకు మీరు పడిన కష్టం నాకు తెలుసు.. ఇంతగా గొప్ప సినిమాలో నన్ను భాగం చేసినందుకు మీరు నా మనసులో ఎప్పటికీ ఉంటారని తెలిపింది. ఇక ఇతర క్యాస్ట్ అండ్ క్రూ ని కూడా ప్రశంసిస్తూ ఇది అందరి విజయం అని పేర్కొంది.
ALSO READ | ఉపాధి కోసం చెన్నైకి వెళ్లిన హీరో.. హీరోయిన్ తో రొమాన్స్.. చివరికి ఏం జరిగిందంటే.?
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుత్తం నటి రష్మిక భాషతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. హిందీలో రష్మిక, ప్రముఖ హీరో విక్కీ కౌశల్ కలసి జంటగా నటించిన "చావా" సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలించిన సమయంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.