Rashmika Mandanna: పుష్ప 2 రష్మిక లుక్ లీక్..శ్రీవల్లి మహారాణిలా భలే ఉందిగా

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి..ఇపుడు వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో బిజీగా ఉన్న హీరోయిన్ రష్మిక మందన్న అని చెప్పుకోవాలి.

ప్రస్తుతం రష్మిక పుష్ప 2 (Pushpa 2)షూటింగ్తో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా పుష్ప 2 షూటింగ్ యాగంటిలో జరుగుతుంది.ఈ లేటెస్ట్ షెడ్యూల్ నుంచి రష్మిక ఫొటోస్, వీడియోస్ లీక్ అయ్యాయి. శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న రష్మిక..ఎరుపు రంగు చీరలో..ఒంటినిండా నగలతో ముస్తాబై మహారాణిలా కనిపిస్తుంది.

అంతేకాకుండా, డైరెక్టర్ సుకుమార్ సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అవుతుంది. ఇది చుసిన ఫ్యాన్స్ పుష్ప..పుష్ప అంటూ అరుస్తున్నారు. ఇక అర్ధం చేసుకోవొచ్చు పుష్ప ఏ రేంజ్ లో ముద్ర వేసుకొందో. అలాగే రష్మిక మందన్న ‘పుష్ప’ సినిమా ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఈ సినిమా సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 

రష్మిక మందన్న విషయానికి వస్తే..టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి భారీ మొత్తంలో ప్రేక్షకులను సొంతం చేసుకుంది. తన క్యూట్ ఎకస్ప్రేషన్స్తో, మెస్మరైజింగ్ లుక్స్తో ఆడియన్స్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. అంతేకాదు ఇంస్టాగ్రామ్లో 40 మిలియన్ల ఫాలోవర్ల మైలు రాయిని దాటేసి సౌత్ హీరోయిన్స్‌లో లిస్ట్లో రికార్డు కూడా నమోదు చేసుకుంది. 

ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తుంది. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందు రానుంది. ఈ సినిమా తరువాత హిందీలో చావా, తమిళం లో ధనుష్ సినిమా, ది గర్ల్ ఫ్రెండ్, సినిమాలు చేస్తోంది.