ఓ వైపు సౌత్‌లో వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు బాలీవుడ్‌లోనూ తన హవా చాటుతోంది రష్మిక మందన్న(Rashmika Mandanna). రీసెంట్‌గా యానిమల్(Animal) చిత్రంలో గ్లామరస్ రోల్‌తో ఆకట్టుకున్న ఆమె ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉంది. తాజాగా రష్మిక హిందీలో నటిస్తున్న ‘ఛవా’ షూటింగ్‌ను కంప్లీట్ చేసింది. ఆమెకిది 22వ చిత్రం. విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. షూట్ పూర్తయిన సందర్భం గా మూవీ టీమ్‌పై ప్రేమను కురిపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది రష్మిక.
డైరెక్టర్ లక్ష్మణ్, ప్రొడ్యూసర్ దినేష్ ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనని, విక్కీ కౌశల్ రత్నం లాం టి వాడని చెప్పింది. ఇదొక పీరియాడికల్ డ్రామా. ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్దకుమారుడు ఛత్రపతి శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తుండగా, శంభాజీ భార్య ఏసుభాయ్ భోంసాలే పాత్రలో రష్మిక కనిపించనుంది. రాజ్య పాలనలో సింహాభాగపు వ్యవహారాలన్నీ చక్కదిద్దే ఏసుభాయ్‌కి ఛత్రపతి మహారాణి అని పేరు ఉంది. అలాంటి పవర్‌ఫుల్ పాత్రలో రష్మిక నటించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు తెలుగులో పుష్ప2, రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో రష్మిక నటిస్తోంది. మరికొన్ని ప్రాజెక్టులు లైనప్‌లో ఉన్నాయి.