కన్నడ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందాన వరుస సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇటీవలే యానిమల్, పుష్ప 2 : ది రూల్ తదితర చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న "ఛావా" అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పీరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించాడు.
అయితే ఇటీవలే నటి రష్మిక మందాన జిమ్ లో వర్కౌట్లు చేస్తూ గాయపడింది. దీంతో కొంతకాలం పాటూ సినిమా షూటింగులకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తెసుకోవాలని డాక్టర్లు సూచించారు. అయినప్పటికి రష్మిక మందాన మాత్రం డాక్టర్ల మాట వినకుండా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. శనివారం ఛావా చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబై లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి రష్మిక వీల్ చైర్ లో వచ్చింది. అలాగే స్టేజ్ పై ఇబ్బంది పడుతూ ఒంటి కాలుపై నడుస్తూ కనిపించింది.
ఈ సందర్భంగా 'ఛావా'లో మహారాణి యేసుబాయి పాత్రను పోషించినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. అలాగే మహారాణి యేసుబాయి తన బాధలని ఎప్పుడూ బయటికి కనిపించనివ్వదని తాను కూడా తన బాధలని బయటికి కనిపించనివ్వనని చెప్పుకొచ్చింది. దీంతో పలువురు నెటిజన్లు ఈ విషయం పై స్పందిస్తూ వాట్ ఏ డెడికేషన్.. రష్మిక రియల్లీ గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ | 31 మిలియన్ల య్యూటుబర్: షార్ట్ వీడియోలతో సెలబ్రిటీ.. ఎవరీ నీతు బిష్త్?
ఈ విషయం ఇలా ఉండగా ఛావా సినిమా ఇప్పటికే గత ఏడాది డిసెంబర్ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అప్పటికే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 రిలీజ్ కావడంతో థియేటర్స్ విషయంలో క్లాష్ ఏర్పడింది. దీంతో ఛావా సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14, 2025న విడుదల కానుంది.