నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) దీపావళి సెలబ్రేషన్స్ మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఏడాదికి కూడా ఆమె దీపావళి పండుగను విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇంట్లోనే జరుపుకొందని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
దీపావళి సందర్భంగా డిజైనర్ శ్రావ్య వర్మ పోస్ట్ చేసిన ఫొటోలు ఈ ప్రచారానికి కారణం. ఆమె విడివిడిగా షేర్ చేసిన ఫొటోల్లో రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ తల్లి, ఇతర స్నేహితులు ఉన్నారు.
విజయ్ షేర్ చేసిన ఫొటోలతోపాటు.. శ్రావ్య షేర్ చేసిన ఫొటోల్లో అందరూ ఒకే కలర్ డ్రెస్‌లో కనిపించారు. దాంతో నెటిజన్లు అంతా రష్మిక ఈ సారి కూడా విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకుందని పోస్ట్‌లు చేస్తున్నారు.
రష్మిక మందన్నషేర్ చేసిన ఫొటోస్‌కు "దీపావళి ఫోటోషూట్ చేశాను! హ్యాపీయెస్ట్ దీపావళి మై లవ్లీస్" అంటూ పోస్ట్ చేయగా.. ఈ ఫొటోస్ క్రెడిట్ 'ఆనంద్ దేవరకొండ' థ్యాంక్యూ ఆనందా అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
గతేడాది కూడా ఇలాంటి ఫొటోల వల్లే రష్మిక దొరికిపోయింది. విజయ్ ఇంట్లో ఫొటోలు దిగి ఆమె షేర్ చేసింది. అదే మెట్లపై దిగిన ఫోటోలను విజయ్, ఆనంద్ కూడా పోస్ట్ చేశారు. రష్మిక.. విజయ్ దేవరకొండ ఇంట్లో కనిపించడం ఇదే మొదటిసారి కాదు.
we can understand aapko sab chupana hota hai 🌝🤍✨🤌#VijayDeveraKonda#RashmikaMandanna#Virosh pic.twitter.com/6aekGMJZ4K
— Virosh trends (@rowdyrashmika) November 1, 2024
విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి రెండు చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ లవ్‌లో ఉన్నారనీ, పెళ్లి కూడా చేసుకోబోతు న్నారనే ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఇప్పటి దాకా ఇరువురు స్పందించలేదు. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులకి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.