![Chhaava Day 1 collections: బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక.. కష్టం ఫలించిందా..?](https://static.v6velugu.com/uploads/2025/02/rashmika-mandanna-chhaava-day-1-collections-in-bollywood_JvreNWDiX4.jpg)
నేషనల్ క్రష్ రష్మిక మందాన వరుస హిట్లు అందుకుంటూ దూసుకుపోతోంది. గత ఏడాది చివరిలో వచ్చిన పుష్ప 2: ది రూల్ ఇండస్ట్రీ అయ్యింది. ఈ ఏడాది ప్రముఖ బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో కలసి నటించిన "చావా" సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో మహారాజా ఛత్రపతి శివాజీ మరియు జీజాబాయిల పెద్ద కుమారుడు మహారాజ్ శంభాజీ పాలన గురించి తెరకెక్కించిన ఈ సినిమాలో శంభాజీ భార్య మహారాణి యేసుబాయి భోంసాలే పాత్రలో రష్మిక మందన్న నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దోసుకుపోతోంది.
అయితే శనివారం చావా సినిమా మేకర్స్ మొదటి రోజు కలెక్షన్స్ ని ప్రకటించారు. ఇందులో భాగంగా మొదటిరోజు రూ.31.1 కోట్లు (నెట్) కలెక్ట్ చేసినట్లు తెలిపారు. హీరో విక్కీ కౌషల్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాల్లో చావా మొదటిలో స్థానంలో నిలిచింది. దీంతో విక్కీ కౌశల్ డెడికేషన్, రష్మిక హార్డ్ వర్క్ బాగానే వర్కౌట్ అయ్యాయని చెప్పవచ్చు. అయితే వీకెండ్ రెండు రోజులు ఉండటంతో శని ఆదివారాల్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు ఈ వరం బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా లేవు. దీంతో చావా సినిమాకి ఈ అంశాలు మరింతగా కలసి వస్తున్నాయి.
Also Read : ఆహా లో ఈ ఏడాది రిలీజ్ కానున్న మోస్ట్ అవైటెడ్ షోస్/వెబ్ సిరీస్లు ఇవే
ఈ విషయం ఇలా ఉండగా నటి 2022లో ప్రముఖ స్టార్ హీరో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన "గుడ్ బై" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ చావా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో హిందీలో రష్మికకి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం రష్మిక హిందీలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ సినిమాకి తమిళ్ ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే రష్మిక జిమ్ లో వర్కౌట్లు చేస్తూ గాయ పడింది. దీంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఇంటి పట్టునే విశ్రాంతి తీసుకుంటోంది.