Rashmika Mandanna: గాయం తర్వాత.. గోల్డెన్ టెంపుల్లో రష్మిక మందన్న.. ఫొటోలు వైరల్

Rashmika Mandanna: గాయం తర్వాత.. గోల్డెన్ టెంపుల్లో రష్మిక మందన్న.. ఫొటోలు వైరల్

నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం తన తాజా సినిమా 'చావా' ప్రమోషన్లో బిజీగా ఉంది. బాలీవుడ్ విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నెల 14న థియేటర్లో రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో 'ఛావా' బృందం అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయంలో సందడి చేసింది. గోల్డెన్ టెంపుల్ లో భక్తి శ్రద్ధలతో కనిపించిన రష్మిక, విక్కీ కౌశల్ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విక్కీ వైట్ కుర్తాలో, రష్మిక పింక్ సూట్ లో కనిపించి అభిమానుల్లో జోష్ నింపారు. ప్రస్తుతం వీరి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ రూపొందిన 'తానా' ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తయ్యాయి. మొఘల్ సామ్రాజ్యాన్ని ఉద్దేశిస్తూ చేసిన కొన్ని సన్నివేశాల్లోని పదాల్లో మార్పులు చేయాలని బోర్డు తెలిపింది.

Also Read :- ఆస్పత్రిలో చేరిన కమెడియన్ పృధ్వీ

ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక కనిపించనుంది.

ఇటీవలే జిమ్‌లో వర్కవుట్ చేస్తూ కాలికి బలమైన గాయమైన విషయం తెలిసిందే. తగిలిన గాయంతో రష్మిక తెగ ఇబ్బంది పడుతున్న పలు ఫొటోస్, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక తాజా ఫోటోలు వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.