Rashmika Mandanna: ‘కుబేర’ నుంచి రష్మిక వీడియో రిలీజ్..పూర్తిగా మార్చేసిన శేఖర్ కమ్ముల

Rashmika Mandanna: ‘కుబేర’ నుంచి రష్మిక వీడియో రిలీజ్..పూర్తిగా మార్చేసిన శేఖర్ కమ్ముల

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్,కింగ్ నాగార్జున లీడ్‌‌‌‌ రోల్స్‌‌‌‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘కుబేర’(Kubera).శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు  నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోన్న ఈ మూవీ నుండి తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఓ వీడియోని కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

 రష్మిక మందన్న ఫస్ట్ లుక్ పోస్టర్

ఇందులో పింక్ కలర్ సూట్ లో సూట్‌కేస్‌ని తీసుకొస్తున్న ఫొటోను రిలీజ్ చేయగా..ఇక వీడియోలో మాత్రం ఆసక్తి కలిగించేలా అర్ధరాత్రి ఓ గడ్డపారతో గొయ్యి తవ్వి సూట్‌కేస్‌ని బయటకు తీయడం చూపించారు. అక్కడ సూట్‌కేస్‌ ఓపెన్ చేయగా..అందులో మొత్తం డబ్బే ఉండడం..ఇక డబ్బును చూసిన రష్మిక తెగ సంతోషపడడం భలేగా ఉంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

నాగార్జున ఫస్ట్ లుక్

ఇక రీసెంట్ గా ‘కుబేర’ నుంచి కింగ్ నాగార్జున ఫస్ట్ లుక్ వీడియోని కూడా మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టర్ వీడియోలో నాగార్జున పాత్ర పూర్తి భిన్నంగా ఉండగా..చీకటి కమ్మిన వానలో ఓ కంటైనర్ నిండ నోట్ల కట్టలు..చేతిలో గొడుగు పట్టుకుని పడిపోయిన నోటుని చూస్తూన్న నాగ్ ని చూపించారు. అలాగే తన జేబులోంచి నోటుని తీసి..ఆ పక్కనే పెట్టి వెళ్లడం ఆసక్తికరంగా ఉంది. అయితే, ఈ సినిమాలో నాగ్ ఆపర కుబేరుడిగా కనిపించే అవకాశాలు ఉన్నట్లు వీడియో చూస్తే అర్ధమవుతుంది.

ధనుష్‌ టైటిల్‌ పోస్టర్

రిలీజ్ చేసిన ధనుష్‌ టైటిల్‌ పోస్టర్ మాత్రం పూర్తి భిన్నమైన లుక్‌లో ఆకట్టుకుంది. చిరిగిన బట్టలు..మాసిన జుట్టు, గుబురు గడ్డంతో ధనుష్ ఆసక్తికరంగా కనిపించారు. మరి సినిమా రిలీజయ్యాక ఎవరో ఎలాంటి పాత్రల్లో నటిస్తున్నారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. 

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ పాన్-ఇండియా మల్టీ లాంగ్వేజ్ మూవీని తెలుగు, తమిళ,   హిందీ భాషల్లో ఏకకాలంలో షూట్ చేస్తున్నారు. త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.