ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి హిరోయిన్ రష్మిక ఓ స్నెవల్ గిఫ్ట్ పంపింది. ఈ విషయాన్ని స్వయంగా బన్నీ సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేస్తూ ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశాడు.
"ఎవరికైనా మనం వెండి బహుమతిగా ఇస్తే వాళ్లకు అదృష్టం కలిసి వస్తుందని మా అమ్మ చెప్పేది. ఈ చిన్న వెండి వస్తువు, స్వీట్స్, మీకు మరింత లక్, పాజెటివిటీ, ప్రేమ అందిస్తాయని నమ్ముతున్న, మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు" అని రష్మిక ఓ లేఖ పంపింది.
దీన్ని అల్లు అర్జున్ ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ... 'థాంక్యూ మై డియర్'.. ఇప్పుడు చాలా అదృష్టం కావాలి అని రాసుకొచ్చారు. దీనిపై రష్మిక స్పందిస్తూ.. బాక్సాఫీస్ వద్ద పుష్ప తప్పకుండా రూల్ చేస్తుంది. మన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రేక్షకులు మన శ్రమను గుర్తిస్తారు. ఆ విషయంలో నేను ఎంతో నమ్మకంతో ఉన్నా' అని పేర్కొన్నారు.
ALSO READ | పుష్ప 2 అఫీషియల్ అప్డేట్.. స్పెషల్ సాంగ్ లో శ్రీలీల కన్ఫర్మ్.
సుకుమార్ డైరెక్షనలో పుపు-1లో అల్లు అర్జున్ ఊరమాస్ యాక్షన్, శ్రీవల్లిగా రష్మిక నటన సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీనికి కొనసాగింపుగా 'పుష్ప-2' సిద్ధమవుతోంది. డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.