మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కెరీర్ లో ఎన్నడూలేని విదంగా వరుస షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో దేవర చేస్తున్న ఎన్టీఆర్.. ఈ సినిమా తోపాటు బాలీవుడ్ వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చాడు యంగ్ టైగర్. అవును.. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చాలా కాలం క్రితమే ఓ సినిమా మొదలుపెట్టాడు ఎన్టీఆర్.
Also Read:చిరంజీవితో ఆషిక రంగనాథ్.. స్ట్రాంగ్ అప్డేట్ ఇచ్చిన విశ్వంభర టీమ్
ఈ సినిమా నుండి తాజాగా మరో అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా రెన్యులర్ షూటింగ్ ఆగస్టు నుండి మొదలుకానుంది అని చెప్పుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలయ్యారు. తాజాగా ఈ సినిమా గురించి మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టు గురించి రష్మికతో డిస్కషన్ కూడా జరిగిందని, కథ బాగా నచ్చడంతో ఆమె కూడా వెంటనే ఒకే చెప్పేశారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.
Happy Birthday to the 'MAN OF MASSES' @tarak9999 ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) May 20, 2024
-Team #NTRNeel
Shoot begins from August 2024.
Brace yourself for a powerhouse project 🔥#HappyBirthdayNTR#PrashanthNeel @NTRArtsOfficial pic.twitter.com/UcXsyzKVhd
ఇక ఎన్టీఆర్ నుండి త్వరలో రాబోతున్న దేవర సినిమా విషయానికి వస్తే.. ఈ పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా చేస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.