నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika mandanna) వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది. ఇక తాజాగా ఈ అమ్మడుకు మరో పాన్ ఇండియా ప్రాజెక్టులో అవకాశం వచ్చిందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మాస్ మహారాజ రవితేజ. మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. త్వరలో షూటింగ్ మొదలై కానున్న ఈ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నాను తీసుకోనున్నారట మేకర్స్.
దానికి కారణం కూడా లేకపోలేదు. రవితేజ, రష్మిక కాంబోలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. అంతే కాదు.. రష్మికకు నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి నార్త్ మార్కెట్ ను కవర్ చేసే ఉద్దేశంతో రష్మిక వైపు మొగ్గు చూపుతున్నారట మేకర్స్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక రష్మిక విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున హీరోగా వస్తున్న పుష్ప2 తోపాటు.. బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న యానిమల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మరి ఈ సినిమాలు రశ్మికకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వనున్నాయో చూడాలి.