
నేషనల్ క్రష్ రష్మికకి ఇండస్ట్రీతో సంబంధం లేకుండా నార్త్ సౌత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. అయితే రష్మిక ఇటీవలే నటించిన పుష్ప 2 ఇండస్ట్రీ హిట్ అయ్యింది.. అంతేకాదు అంతకుముందు బాలీవుడ్ లో నటించిన యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ అయిపొయింది. ఈమధ్య రష్మిక రెమ్యునరేషన్ కూడా బాగానే పెంచేసినట్లు సమాచారం.
ప్రస్తుతం రష్మిక మందాన బాలీవుడ్ లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న "సికందర్" అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని ప్రముఖ డైరెక్టర్ మురగదాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా కీలకపాత్రలో నటిస్తోంది. ఐతే ఈ సినిమాకోసం రష్మిక మందాన దాదాపుగా రూ.10 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.. ఇక నటి కాజల్ కి రూ.3 కోట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ALSO READ | Chhaava Telugu review: హిస్టారికల్ యాక్షన్ డ్రామా ఎలా ఉందంటే.?
పెళ్లయిన తర్వాత నటి కాజల్ పెద్దగా సినిమాల్లో నటించడం లేదు.. అలాగే కథల విషయంలో కూడా చాలా సెలెక్టివ్ గా ఉంటోంది. రష్మిక కి గతంలో రెండు హిట్లు పడటంతో దర్శక నిర్మాతలు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారు. రష్మిక నటించిన మరో బాలీవుడ్ సినిమా "ఛావా" కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈ కారణంగానే కాజల్ కంటే కొంచెం ఎక్కువ మొత్తంలో రష్మిక రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక సికందర్ నటీనటులు విషయానికొస్తే ప్రతీక్ బబ్బర్, సత్యరాజ్, శర్మన్ జోషి, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వం వహించడంతోపాటూ సహనిర్మాతగా కూడా ఉన్నారు. ఈ సినిమా ఈద్ సందర్భంగా మార్చ్ 28న రిలీజ్ కానుంది.