VijayRashmika: విజయ్ దేవరకొండపై ఫ్యాన్స్ విమర్శలు.. దయ తగ్గుతుందంటూ రష్మిక సంచలన పోస్ట్!

VijayRashmika: విజయ్ దేవరకొండపై ఫ్యాన్స్ విమర్శలు.. దయ తగ్గుతుందంటూ రష్మిక సంచలన పోస్ట్!

గతేడాది ‘పుష్ప2’ చిత్రంతో  బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రష్మిక మందన్నా.. ఈ ఏడాది కూడా అదే జోరు చూపించేందుకు రెడీ అయ్యింది. కానీ ప్రారంభంలోనే రష్మిక కాలికి గాయమై ప్రస్తుతం షూటింగ్స్‌‌కు దూరంగా ఉంటోంది.

అయితే ఆమె నటించిన హిందీ సినిమా ‘ఛావా’ మూవీ ప్రమోషన్స్‌‌ కోసం మాత్రం వీల్ చైర్‌‌‌‌లో వస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. విక్కీ కౌశల్‌‌ హీరోగా నటించిన ఈ మూవీలో మహారాణి యేసుభాయి పాత్రలో ఆమె కనిపించనుంది. ఫిబ్రవరి 14న సినిమా విడుదల కానుంది.

లేటెస్ట్గా బ్యూటీ రష్మిక సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్‌‌గా మారింది. ‘ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతోంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను. మీరంతా కూడా ఒకరిపై ఒకరు దయతో ఉండండి’ అని పోస్ట్ చేసింది. దీంతో  ఆమె ఎవరి గురించి ఇది రాసిందా అనే ఆరాలు తీస్తున్నారు నెటిజన్స్.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హైదరాబాద్లో విజయ్, రష్మిక కలిసి జిమ్ నుంచి బయటకి వస్తోన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వీడియో నెటిజన్లను బాగా నిరాశపరిచింది. దాంతో విజయ్ చేసిన పనిపై నెటిజన్స్ నుంచి భిన్నమైన కామెంట్స్ వినిపించాయి. 

ఈ వైరల్ క్లిప్‌లో, ముందుగా జిమ్ నుంచి కారు ఎక్కడానికి విజయ్ బయటికి వచ్చాడు. గాయపడిన రష్మికకు విజయ్ సహాయం చేయకుండా బయటికి రావడంపై రష్మిక ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. రష్మికకు అవసరమైన సమయంలో విజయ్ ఎందుకు తన సపోర్ట్ అందించలేదని ప్రశ్నిస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేయడంతో.. తాజాగా రష్మిక దయ కలిగి ఉండండి అంటూ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అలాగే తను వేసుకున్న టీ షర్ట్‌‌పైన కూడా ‘కైండ్‌‌ ఫుల్‌‌’ అని ఉండటంతో ఈ పోస్ట్‌‌కు తమకు తోచిన విధంగా కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఆమె నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సౌత్‌‌లో మూడు, నార్త్‌‌లో మూడు మొత్తం అరడజను సినిమాలతో బిజీగా ఉంది.