Rashmika and Vijay: కన్నడ బ్యూటీఫుల్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందాన ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బిజిబిజీగా గడుపుతోంది. దీంతో హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్ ఇలా అన్ని భాషల్ని కవర్ చేస్తూ తన సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తోంది. అయితే రష్మిక మందాన ఇటీవల ఓ పాడ్ క్యాస్ట్ లో పాల్గొంది. ఇందులో భాగంగా హోస్ట్ తమిళ్ లో మీరు చూసిన మొదటి సినిమా ఏదని అడిగాడు.
దీంతో రష్మిక తమిళ్ దళపతి విజయ్ హీరోగా నటించిన గిల్లీ సినిమా అని చెప్పింది. ఇక్కడివరకూ బాగానే ఉంది. కానీ అంతటితో ఆగకుండా చాలా కాన్ఫిడెంట్ గా గిల్లీ తెలుగులో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా రీమేక్ అని రీసెంట్ గా తెలిసిందని, అలాగే ఈ సినిమాలోని అప్పడిపోడే సాంగ్ తనకి చాలా ఇష్టమని తెలిపింది. అలాగే ఈ పాటకి లెక్కలేనన్ని సార్లు డ్యాన్స్ చేశానని చెబుతూ తన లైఫ్ లో మొదటగా బిగ్ స్క్రీన్స్ పై చుసిన మొదటి హీరో విజయ్, హీరోయిన్ త్రిష అని పేర్కొంది. అయితే గిల్లీ సినిమా ఒక్కడు రీమేక్. ఈ విషయం తెలియక రష్మిక పోకిరి రీమేక్ అని చెప్పడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో టీజీ ట్రోల్ చేస్తున్నారు.
ALSO READ : Game Changer: గేమ్ ఛేంజర్ కోసం ఇండియాలోనే అతిపెద్ద కటౌట్.. ఎక్కడో తెలుసా..?
దీంతో రష్మిక ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా స్పందించింది. ఇందులోభాగంగా గిల్లీ సినిమా ఒకడు రీమేక్ అని అలాగే పొక్కిరి(విజయ్ తమిళ్) తెలుగు పోకిరి(మహేష్) రీమేక్ అని ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత తెలిసిందని అది నా మిస్టేక్, సారీ అని పేర్కొంది. అలాగే నాకు అన్ని సినిమాలు ఇష్టం అని ఎక్స్ లో ట్వీట్ చేసింది. దీంతో కొందరు నెటిజన్లు స్పందిస్తూ 'ఒకే ఒకే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరగడం సహజం అంటూ బ్రమ్మి ఎమోజీస్ షేర్ చేస్తూ ఫన్నీగా రిప్లై ఇస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా రష్మిక హీరోయిన్ గా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 05న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఇండస్ట్రీ అవ్వడంతోపాటూ దాదాపుగా రూ.1500 కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం రష్మిక ప్రముఖ తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.
Avunu .. telusu sorry.. okka booboo aipoindi.. 🐒 interview ayipointarvata annukunna reyyyy ghilli is okkadu ra .. pokkiri is pokiri ani.. 🤦🏻♀️ social media lo ippudu estuntaaru ani.. sorry sorry my bad.. but I love all of their movies so it’s ok. 🐒
— Rashmika Mandanna (@iamRashmika) December 21, 2024