Rashmika Mandanna: రశ్మికకు కాబోయే భర్త VDలా ఉండాలట.. VD అంటే తెలుసుగా!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసింది. ఎలాంటి దాపరికాలు లేకుండా 100 పర్సెంట్ అలానే ఉండాలంటూ మనసులో మాటని చెప్పకనే చెప్పేసింది. ఇటీవల ఆమె ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా కవర్ పేజీపై కనిపించిన విషయం తెలిసిందే. దాంతో ఆమె పేరు నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యింది. ఈ సందర్బంగా టాప్ స్టార్స్ సైతం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ సైతం సోషల్ మీడియా వేదికగా రష్మికపై ప్రశంసలు కురిపించాడు. 

ఇదిలా ఉంటే.. తాజాగా రష్మిక తన ఇన్స్టాలో ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఫిర్బ్స్ మ్యాగజైన్ పై కనిపించిన తరువాత ఆమె మొదటి ఫ్యాన్స్ ఇంట్రక్షన్ కావడంతో.. చాలా మంది ఫ్యాన్స్ చాలా ప్రశ్నలు అడిగారు. వాటికి రష్మిక కూడా చాలా ఓపికగా సమాదానాలు చెప్పుకోచ్చారు. ఇందులో భాగంగా ఒక నెటిజన్ రష్మికకు కాబోయే భర్త గురించి అడుగుతూ.. రష్మికకు కాబోయే భర్త ఎలా ఉండాలి? ఆమె నేషనల్ క్రష్ కాబట్టి.. కాబోయేవాడు చాలా ప్రత్యేకం. అతను VD(విజయ్ దేవరకొండలా కాదు)లా ఉండాలి. VD  అంటే వెరీ డేరింగ్ అని అర్థం. అనుక్షణం ఆమెను రక్షించాలి. మాకు ఆమె రాణి కాబట్టి వచ్చేవాడు రాజై ఉండాలి..  అంటూ రాసుకొచ్చాడు. 

నెటిజన్ చేసిన కామెంట్ కు స్పందించిన రష్మిక.. దట్స్ 100 ప్రసెంట్ ట్రూ.. అంటూ స్మైలీ అండ్ హార్ట్ సింబల్ ను జతచేసింది. దీంతో రష్మిక ఇచ్చిన ఈ రిప్లయ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ రిప్లై చూసిన నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. రష్మిక తనకు కాబోయేవాడి గురించి చెప్పకనే చెప్పేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి రష్మిక, విజయ్ మధ్య ఎదో ఉందని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో రష్మిక ఇచ్చిన రిప్లయ్ అనుమానాలకు తావిస్తోంది. 

ALSO READ :- గగన్ యాన్కు నలుగురు వ్యోమగాములు సెలెక్ట

ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ సరసన పుష్ప 2లో నటిస్తున్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు రెయిన్ బో, ద గర్ల్ ఫ్రెండ్, చావా అనే సినిమాల్లో కూడా నటిస్తున్నారు రష్మిక మందన్న.