హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జిమ్‌లో వర్కవుట్ చేస్తూ కాలికి బలమైన గాయమైన విషయం తెలిసిందే. తగిలిన గాయంతో రష్మిక తెగ ఇబ్బంది పడుతూ ఇవాళ ఉదయం (జనవరి 22న) ముంబై బయలుదేరింది.
రష్మిక హైదరాబాద్ విమానాశ్రయంలో కార్ లో నుండి దిగి వీల్‌చైర్‌లో వెళ్తున్న వీడియో బయటికి వచ్చింది. ఇందులో రష్మిక ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత, కారు దిగేందుకు ఇబ్బంది పడుతున్నట్లు వీడియోలో కనిపించింది. అలాగే ఆమె కుంటుతూ, తన టీమ్ మద్దతును తీసుకుని వీల్‌చైర్‌లో కూర్చుంది.
అలా తోటివారి సహాయంతో ఎయిర్‌పోర్టు లోపలికి వెళుతున్నవీడియో వైరల్ అవ్వడంతో రష్మిక ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు.
రష్మిక నుంచి రాబోయే బాలీవుడ్ హిస్టారికల్ మూవీ ఛావా. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కోసం ముంబై బయలుదేరింది రష్మిక. ఈ క్రమంలో హైదరాబాద్ విమానాశ్రయంలో వీల్ చైర్‌లో కనిపించింది. అయితే, ఆమె గాయంతో బాధపడుతున్నప్పటికీ, తన సినిమా ప్రమోషన్స్ కోసం ఈవెంట్‌కు వెళుతుండటంతో తనకు సినిమాపై ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తుంది.
#RashmikaMandanna was spotted in a wheelchair at the airport due to a leg injury. pic.twitter.com/91psnQT99Z
— Ramesh Pammy (@rameshpammy) January 22, 2025
ప్రస్తుతం రష్మిక తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తుంది. అందులో ఒకటి సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్. ఈ మూవీ ముంబైలో షూటింగ్ జరుగుతోంది. తమిళ్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరొకటి 'ఛావా'. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ఈ హిస్టారికల్ మూవీలో రష్మిక సంభాజీ మహారాజ్ భార్య మహారాణి యసుబాయ్ పాత్రలో కనిపించనుంది. తెలుగులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ మూవీలో నటిస్తుంది.