కన్నడ స్టార్ హీరోయిన్ రష్మిక మందాన వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ్, హిందీ అంటూ ఇలా అన్ని పరిశ్రమలోనూ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బిజిబిజీగా ఉంటోంది.
నేషనల్ క్రష్ హీరోయిన్.. పుష్ప శ్రీవల్లికి దెబ్బ తగిలింది.. ప్రతిరోజూ క్రమం తప్పకుండా రష్మిక (Rashmika Mandanna) వర్కవుట్స్ చేస్తుంది. జిమ్ లో కసరత్తు చేయటం రొటీన్. రోజూ మాదిరిగానే.. జిమ్ లో వర్కవుట్ చేస్తుండగా.. కాలికి గాయం అయ్యిందంట.. ప్రస్తుతం గాలికి తగిలిన గాయంతో తెగ ఇబ్బంది పడుతుంది అంటే రష్మిక. డాక్టర్లు కూడా పరీక్షించి.. గాయం చిన్నదే అని.. పెద్దగా ప్రమాదం లేదని తేల్చి చెప్పారంట.. కాకపోతే ఓ వారం రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారంట.. డాక్టర్ పెద్దల సూచనలతో.. ప్రస్తుతం రష్మిక ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారంట..
ALSO READ | Game Changer: గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత.. ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లంటే?
ప్రస్తుతం రష్మిక మందాన హిందీలో ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి ప్రముఖ తమిళ్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తుండగా ముంబైలో షూటింగ్ జరుగుతోంది. అయితే గాయం కారణంగా రష్మిక సికిందర్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ విషయం ఇలా ఉండగా రష్మిక నటించిన పుష్ప 2 గత ఏడాది డిసెంబర్ 05న రిలీజ్ కాగా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఈ సినిమా దాదాపుగా రూ.1800 కోట్లు పైగా కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం రష్మిక తెలుగులో ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర, గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటిస్తున్న చావా తదితర సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో చావా సినిమా షూటింగ్ పనులు పూర్తీ కాగా రిలీజ్ కి సిద్దంగా ఉంది.