గెట్ రెడీ ఫాన్స్ .. రష్మిక మందన్న .. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ వచ్చేస్తుంది

గెట్ రెడీ ఫాన్స్ .. రష్మిక మందన్న .. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ వచ్చేస్తుంది

బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాల్లో నటిస్తోంది రష్మిక మందన్న.  ఈనెల 5న ‘పుష్ప2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే  ప్రస్తుతం  ఆమె లీడ్ రోల్‌‌‌‌లో  నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’.  రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రష్మికకి జంటగా   దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి.  ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను త్వరలో రిలీజ్ చేయనున్నట్టు మంగళవారం ప్రకటించారు. 

తాజాగా ‘పుష్ప2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌లో దర్శకుడు సుకుమార్.. రష్మిక నటనను మెచ్చుకుంటూ, ఆమె నటించిన ‘గర్ల్ ఫ్రెండ్’ టీజర్‌‌‌‌‌‌‌‌ చూశానని, చాలా బాగుందని చెప్పడంతో టీజర్‌‌‌‌‌‌‌‌పై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.  హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం - అందిస్తున్నాడు. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున నటిస్తున్న ‘కుబేర’ చిత్రంలో రష్మిక హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. అలాగే ఛావ, సికిందర్, రెయిన్ బో వంటి క్రేజీ ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉంది.