వరుస విజయాలతో ఊపులో రష్మిక..ఛావాతో మరో హిట్

వరుస విజయాలతో ఊపులో రష్మిక..ఛావాతో మరో హిట్

గత ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో ‘పుష్ప 2’తో బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌ హిట్ అందుకున్న రష్మిక మందన్న..తాజాగా మరో భారీ విజయాన్ని అందుకుంది.  ఆమె హీరోయిన్‌‌‌‌గా నటించిన బాలీవుడ్ మూవీ ‘ఛావా’. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకుడు. 

శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలిరోజు రూ.31 కోట్ల కలెక్షన్స్‌‌‌‌ను సాధించి సూపర్ హిట్ టాక్‌‌‌‌ను అందుకుంది. విక్కీ కౌశల్ కెరీర్‌‌‌‌‌‌‌‌లో బెస్ట్ ఓపెనింగ్స్‌‌‌‌ సాధించిన చిత్రాల్లో  ఇది ఫస్ట్ ప్లేస్‌‌‌‌లో నిలిచింది. 

ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇందులో శంభాజీగా విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక నటించారు. ఇద్దరి నటనకు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్‌‌‌‌ సీన్స్‌‌‌‌ ఎమోషనల్‌‌‌‌గా కనెక్ట్ చేశానంటున్నారు సినీలవర్స్. 

కన్నడిగుల కన్నెర్ర

‘ఛావా’ మూవీ రిలీజ్‌‌‌‌కు ముందు ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌‌‌‌లో.. తాను హైదరాబాద్‌‌‌‌ నుంచి వచ్చానని చెప్పింది రష్మిక.  ఈ వ్యాఖ్యలపై కన్నడిగులు మండిపడు తున్నారు. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్ పేట రష్మిక స్వస్థలం. 

కానీ హైదరాబాద్ తన సొంతూరు అని చెప్పుకోవడంపై కన్నడికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌లో ఉంటోంది కనుక అలా చెప్పి ఉండొచ్చని కూడా కొందరు ఆమెను సమర్థిస్తున్నారు.