ముస్తాబైన రాష్ట్రపతి భవన్.. ప్రమాణస్వీకారానికి అంతా సిద్ధం..

ముస్తాబైన రాష్ట్రపతి భవన్.. ప్రమాణస్వీకారానికి అంతా సిద్ధం..

మోదీ ప్రమాణస్వీకారానికి రాష్ట్రపతిభవన్ ముస్తాబైంది. సరిగ్గా రాత్రి 7గంటల 15 నిమిషాలకు మోదీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. మోదీతో పాటు.. 70 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి దేశవిదేశీ అతిథులు వస్తుండటంతో రాజధానిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 

ప్రధానిగా ప్రమాణం తర్వాత మోదీ నేరుగా వారణాసి వెళ్లనున్నారు. అక్కడ ప్రత్యేకపూజలు చేయనున్నారు. పూర్తిస్థాయి కేబినెట్ ఇవాళే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.మిత్రపక్షాల నుంచి 12 మంది ప్రమాణం చేయనున్నారు.  తెలుగురాష్ట్రాల నుంచి ఐదుగురికి మంత్రిపదవులు దక్కనున్నాయి.. టీడీపీ నుంచి ఇద్దరికి ఛాన్స్ దక్కగా.. ఏపీ బీజేపీ నుంచి ఒకరికి..తెలంగాణ బీజేపీనుంచిఇద్దరికి మంత్రి పదవులు దక్కనున్నాయి.