మార్కెట్లోకి రస్నా పౌడర్ కాన్సంట్రేట్‌‌‌‌‌‌‌‌

మార్కెట్లోకి రస్నా పౌడర్ కాన్సంట్రేట్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్​, వెలగు:సాఫ్ట్​ డ్రింకులు తయారు చేసే రస్నా ఇండియా రస్నా రిచ్​ను ప్రవేశపెట్టింది. ఇది పౌడర్​ కాన్సంట్రేట్​. ఒక్కో ప్యాకెట్​తో మూడు గ్లాసుల డ్రింక్​తయారు చేయవచ్చని కంపెనీ తెలిపింది.   రస్నా రిచ్ మామిడితో పాటు ఆరెంజ్, నిమ్మ, అనాస, జామ  మిక్స్ ఫ్రూట్ వంటి  రుచుల్లో కూడా లభిస్తుంది. ధరలు రూ.10–20 మధ్య ఉంటాయి. 

పోటీ కంపెనీ ప్రొడక్టులతో పోలిస్తే రస్నా రిచ్​ రస్నా రిచ్ అతి తక్కువ ధరలో ప్రీమియం రుచిని అందిస్తుందని సంస్థ చెబుతోంది. ఇందులో 21 విటమిన్లు,  ఖనిజాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిదని పేర్కొంది. స్కూల్స్, పిక్నిక్స్,  ప్రయాణాల్లో ఉపయోగించవచ్చు.