కాగజ్ నగర్, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బోరంపల్లి గ్రామంలో ఇటీవల మహాత్మా జ్యోతిరావు, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలు ధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు లేండుగురే శ్యామ్ రావు, రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి డిమాండ్ చేశారు. ఆదివారం కాగజ్ నగర్ రూరల్ పీఎస్సమీపంలోని మెయిన్ రోడ్డుపై రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుతం మహనీయుల విగ్రహాలకు రక్షణ కల్పించాలన్నారు. రాస్తారోకోలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నక్క మనోహర్, కాగజ్ నగర్ పట్టణ ఇన్‌చార్జి షబ్బీర్ హుస్సేన్, పట్టణ ఉపాధ్యక్షుడు తన్నీరు పోచం, ప్రధాన కార్యదర్శి సిద్ధం శ్రీను, రేణుకుంట్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి పిల్లల తిరుపతి, మాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌత్రే గోపాల్ పాల్గొన్నారు.