ఇటీవల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీల్లో వెలుగులోకొస్తున్న సంఘటనలు చూస్తోంటే బయట ఫుడ్ అన్న ఆలోచన వస్తేనే ఒంట్లో వణుకు పుడుతోంది. పేరు మోసిన పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు సైతం కనీస శుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఎక్కడికక్కడ హోటళ్లు, రెస్టారెంట్లను సీజ్ చేస్తున్నారు అధికారులు. తాజాగా ఓ ఛాట్ భండార్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు జరిపిన తనిఖీల్లో భయంకర దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. బేగం బజార్లో తనిఖీలు నిర్వహించగా ఓ ఛాట్ భండార్ ఎలుకల కంపగా మారిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
ALSO READ | బీరు తాగే వారిని ఎక్కువుగా దోమలు కుడతాయట..
బేగం బజార్లోని శ్యామ్ సింగ్ అనే ఛాట్ భాండార్లో జరిపిన ఎలుకల గుంపు దర్శనమిచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంకా పానీపూరి కోసం వాడే మసాలా వాటర్లో సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు అధికారులు. నూడిల్స్, పెరుగు వంటి ఆహార పదార్థాలపై ఎటువంటి మూతలు లేకుండా అలాగే ఉంచినట్లు తెలిపారు అధికారులు. సదరు ఛాట్ భండార్లోని సిబ్బంది హైర్ నెట్స్, చేతికి గ్లోవ్స్, ఆఫ్రాన్స్ ధరించటం వంటి కనీస శుభ్రతా ప్రమాణాలు కూడా పాటించటంలేదని తెలిపారు అధికారులు.