రతన్ టాటా.. టాటా గ్రూప్ చైర్మన్ గా చేశారు.. టాటా గ్రూప్ వారసుడు కూడానూ.. టాటా గ్రూప్ కాకుండా.. రతన్ టాటా వ్యక్తిగత ఆస్తులు వేల కోట్లుగా ఉన్నాయి. 2022 సంవత్సరం లెక్కల ప్రకారం రతన్ టాటా ఆస్తుల విలువ 3 వేల 800 కోట్ల రూపాయలు. ఈ ఆస్తులు అన్ని స్థిర, చరాస్తులుగా ఉన్నాయి. ఖరీదైన ఇళ్లతోపాటు కార్లు, ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయి.
>>> రతన్ టాటా వ్యక్తిగత ఆస్తుల విలువ 3 వేల 800 కోట్ల రూపాయలు.
>>> Ola, Ant finanace, yourstory, paytm, lenskart, urban company వంటి 53 స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు.
>>> ముంబై సిటీలో సముద్రానికి ఎదురుగా.. కొలాబా అనే పెద్ద బంగ్లా ఉంది.. దాని విలువ 200 కోట్ల రూపాయలు.
>>> కార్ల విషయానికి వస్తే.. జాగ్వార్ ఎఫ్-టైప్ S మసెరటి క్వాట్రో పోర్టే, బెంజ్ వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి.
>>> దసాల్క్ ఫాల్కన్ పేరుతో ఓ ప్రైవేట్ జెట్ ఉంది.
>>> ఇన్సూరెన్స్ లు, ఇతర పెట్టుబడులు అన్నీ కలిపి మొత్తంగా 3 వేల 800 కోట్ల రూపాయలు ఉన్నాయి.
రతన్ టాటా పెళ్లి చేసుకోదు.. దీంతో ఇప్పుడు ఆయన ఆస్తులకు వారసులు ఎవరు.. ఈ వేల కోట్ల రూపాయలు ఎవరికి సొంతం కాబోతున్నాయి అనేది చర్చనీయాంశం అయ్యింది. టాటా గ్రూప్ వర్గాల సమచారం ప్రకారం.. రతన్ టాటా ఆస్తులకు వీళ్లే వారసులు అనే ప్రచారం జరుగుతుంది.
రతన్ టాటా తండ్రి రెండో భార్యకు పుట్టిన నోయెల్ టాటా (తమ్ముడు) కుటుంబానికి రతన్ టాటా ఆస్తులు చెందే అవకాశం ఉన్నట్లు సమాచారం. నోయెల్ టాటాకు మాయ, నావల్, లియా టాటా అనే ముగ్గురు పిల్లలున్నారు. రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా కుమార్తె మాయ టాటా.. ప్రస్తుతం టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో పని చేస్తున్నారు. మాయ తల్లి దివంగత టాటా గ్రూప్ చైర్మన్ సైరన్ మిస్త్రీ సోదరి. దివంగత బిలియనీర్ పల్లోంజి మిస్త్రీ కుమార్తె.
మాయ టాటా సోదరుడు నెవిల్లే టాటా ట్రెంట్ లిమిటెడ్ కింద టాటా స్టార్ బజార్ అనే హైపర్ మార్కెట్ చైన్ కు నాయకత్వం వహిస్తున్నారు. జూడియో, వెస్ట్ సైడ్ బాధ్యతలు కూడా నెవిల్లే చూస్తున్నాడు. ఇతనే టాటా గ్రూప్ కు అసలైన వారసుడని చాలా మంది నమ్ముతారు. నెవిల్లే టయోటా కిర్లోస్కర్ గ్రూప్ వారసురాలు మాన్సీ కిర్లోస్కర్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి జంషెడ్ టాటా అనే కొడుకు ఉన్నారు.