రతన్​ టాటా .. వ్యాపార దిగ్గజం... యువకులకు స్ఫూర్తి..

రతన్​ టాటా .. వ్యాపార దిగ్గజం... యువకులకు స్ఫూర్తి..

భారత పారిశ్రామిక చరిత్రలో ఓ శకం ముగిసింది. దేశ కీర్తిని ఖండాంతరాలకు చాటిన వ్యాపార దిగ్గజం నేలకొరిగింది. టాటా సన్స్ సంస్థ మాజీ చైర్మన్ రతన్ టాటా ఇకలేరు. వృద్ధాప్య సంబంధమైన అనారోగ్యంతో బుధవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.  రతన్​ టాటా .. వ్యాపారవేత్తగా ఎంతగా రాణించారో వేరే చెప్పనక్కరలేదు.  సంపాదనలోనే కాదు.. ఆయన చేసిన సంఘానికి చేసిన సేవలు కూడా ఎంతో అద్భుతం..  అసలు రతన్​ టాటా ఎవరు.. ఆయన జీవితం ఎలా సాగింది.. ఆయనను నేటి తరం  యువత ఎందుకు స్ఫూర్తిగా తీసుకోవాలో తెలుసుకుందాం. . . .

రతన్​ టాటా వ్యాపారంలో ఎన్నో విజయాలు సాధించారు.  తన కెరీర్​ ప్రారంభం నుంచే చురకైన సేవలు అందిస్తూ.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.  టాటా గ్రూప్​ వారసుడిగా ప్రపంచ వ్యాప్తంగా అత్యున్నత గౌరవం పొందారు.  ఓ పక్క సక్సెస్​ సాధిస్తూ.. మరో పక్క సమాజ సేవలు చేస్తూ ఎంతో కీర్తిని సంపాదించారు. రతన్ నావల్ టాటా.. నావల్ టాటా కుమారుడు. అయితే ఆయనను టాటా గ్రూప్​ వ్యవస్థాపకుడు జమ్‌సెట్జీ టాటా కుమారుడు  రతన్‌ జీ టాటా దత్తత తీసుకున్నారు.   ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పట్టా పొందిన ఆయన.. 1961 లో టాటా కంపెనీలో  స్టీల్ షాప్ ఫ్లోర్‌లో ఉద్యోగిగా పనిచేశారు.  ఆ తరువాత 1991 లో  టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2012 వరకు టాటా గ్రూప్‌నకు   ఛైర్మన్‌గా  కొనసాగిన రతన్ ...  ఆ తర్వాత అక్టోబరు 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా రతన్ టాటా కొనసాగారు. 

రతన్​ విద్యాభ్యాసం ఎలా సాగిందంటే..

ముంబైలోని క్యాంపియన్ స్కూల్‌లో 8వ తరగతి వరకు చదివిన తరువాత ఉన్నత చదువులకు  కేథరల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో చదివారు.  సిమ్లలోని  బిషప్ కాటన్ స్కూల్‌లో కూడా విద్యాభ్యాసం చేశారు.  న్యూయార్క్‌లోని రివర్‌డేల్ కంట్రీ స్కూల్‌లో  1955లో హైస్కూల్ నుంచి పట్టా పొందాక ... టాటా కార్నెల్ యూనివర్శిటీలో చేరారు. అక్కడే ఆయన 1959లో ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

Also Read :- రతన్ జీ చెప్పిన గోల్డెన్ వర్డ్స్

రతన్ టాటా వ్యక్తిగత జీవితం :

 పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో 1937 డిసెంబర్​ 28న ముంబైలో రతన్​ టాటా జన్మించారు. సూరత్​ లో ఉండే  నావల్ టాటా, జమ్‌సెట్‌జీ మేనకోడలు సూని  ఫ్యామిలి ఆయనను దత్తత తీసుకున్నారు. ఆయనకు పదేళ్ల వయస్సులో తల్లిదండ్రులు విడిపోయారు.  దీంతో టాటా అమ్మమ్మ నవాజ్‌బాయి టాటా మరోసారి దత్తత తీసుకున్నారు.దాంతో రతన్ టాకు ఒక తమ్ముడు జిమ్మీ టాటా, సవతి సోదరుడు నోయెల్ టాటా ఉన్నారు. టాటా తన చిన్నతనంలో ఎక్కువ భాగం భారత్‌లోనే గడిపారు. దురదృష్టవశాత్తు.. రతన్ టాటా అమ్మమ్మ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన భారత్‌కు వెళ్లవలసి వచ్చింది. 

బిరుదులు, గౌరవ డాక్టరేట్స్ 

రతన్ టాటాకు భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం, పద్మ విభూషణ్, మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ లభించాయి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ, ఒహియో స్టేట్ యూనివర్శిటీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ ఐఐటి ఖరగ్‌పూర్‌తో సహా పలు ప్రతిష్టాత్మక సంస్థల నుంచి గౌరవ డాక్టరేట్‌లను కూడా అందుకున్నారు.

టాటా బ్రాండ్ నేమ్‌ను ఉపయోగించుకున్నందుకు టాటా సన్స్‌కి రాయల్టీ చెల్లించమని గ్రూప్ కంపెనీలను ఒప్పించాడు. వ్యక్తిగత కంపెనీలను గ్రూప్ ఆఫీసుకు రిపోర్టు చేయమన్నారు. సాఫ్ట్‌వేర్ వంటి ఇతర వాటిపై దృష్టిని పెంచింది. టెలికాం వ్యాపారం, ఫైనాన్స్ రిటైల్‌లో కూడా టాటా గ్రూపు ప్రవేశించింది. అదే సమయంలో విమర్శలు వచ్చినప్పటికీ జేఆర్డీ టాటా రతన్ టాటాకు మార్గదర్శకుడిగా మార్గనిర్దేశం చేశారు.