వీధి కుక్క అంటే అందరికీ లోకులే.. ఎవరు పడితే వాళ్లు కొడతారు.. అలాంటి వీధి కుక్కల విషయంలో ఎంతో మానవత్వం చూపించారు రతన్ టాటా.. వీధి కుక్కల కోసం వందల కోట్ల రూపాయల విలువైన భవనాన్ని ఇచ్చేశారు.. ఆ బిల్డింగ్ లో ఫుల్ ఏసీ ఉంటుంది.. కుక్కల కోసం వాకింగ్ ట్రాక్ ఉంటుంది.. తాజ్ హోటల్స్ నుంచి వాటికి ఫుడ్ వస్తుంది.. ఆ వచ్చే ఫుడ్ వ్యాన్ కూడా ఏసీనే.. మూగ జీవాలపై రతన్ టాటాకు ఉన్న ప్రేమకు ఇంత కంటే నిదర్శనం ఉంటుందా.. ముంబై సిటీలోనే.. ఖరీదైన కొలాబా ప్రాంతంలో.. ముంబై హౌస్ బిల్డింగ్ లో వీధి కుక్కల కోసం ప్రత్యేక ఫ్లోర్లు ఉన్నాయంటే నమ్మలేని నిజమే కదా.. అందుకే అన్నారు దటీజ్ రతన్ టాటా అని..
ALSO READ | Ratan Tata: రతన్ టాటా ప్రస్థానం: 10వేల కోట్ల నుండి లక్ష కోట్ల దాకా
టాటా ప్రధాన కార్యాలయమైన బాంబే హౌస్‌లో వందల సంఖ్యలో వీధికుక్కలను పోషిస్తున్నారు. వాటికి ఏసీ రూమ్ లు, ఫైవ్ స్టార్ హోటల్ తాజ్ నుంచి కుక్కలకు ఫుడ్ తెప్పిస్తారు. వాటి సంరక్షణ చూసుకోవడానికి ప్రత్యేక సిబ్బంది కూడా అక్కడ ఉన్నారు. రోడ్డుపై వీధికుక్కల ప్రమాదాల భారిన పడటం రతన్ టాటాను ఎంతో బాధ కలిగించింది. వీధికుక్కలకు జరిగే రోడ్డుప్రమాదాలను తగ్గించాలని ఓ ప్రాజెక్ట్ చేశారు. రిఫ్లెక్ట్ అయ్యి ఓ రిబ్బన్ ను కుక్కలకు వేస్తారు. దీంతో డ్రైవింగ్ చేసే వారు వాటిని సులభంగా గుర్తించారు. చీకట్లో కూడా రోడ్డుపై కుక్కలు మెరుస్తున్నట్లు కనిపిస్తాయి.